24, ఆగస్టు 2026, సోమవారం

24-08-2026సోమవారం రాశి ఫలితాలు

 శ్రీ మాత్రేనమః 🙏

శ్రీ గురుభ్యోనమః 🙏

24-08-2026సోమవారం రాశి ఫలితాలు


మేషం


భాగస్వామ్య వ్యాపారాలు మధ్య స్వల్ప విభేదాలు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో చికాకులు తప్పవు. వాహనాల ప్రయాణ విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్ధిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. ఉద్యోగులకు నూతన సమస్యలు కలుగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.      

--------------------------------------- 


వృషభం


నూతన కార్యక్రమాల ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆర్ధిక పరిస్థితి అనుకూలిస్తుంది. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది.

---------------------------------------


మిధునం


వ్యాపారమున ఎంతగా శ్రమించినా ఫలితం లభించక నిరాశ కలుగుతుంది. గృహమున పెద్దల ఆరోగ్య విషయం ఆందోళన కలిగిస్తుంది. బంధువులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఇతరులకు ధన వ్యవహారాలలో మాట ఇవ్వకపోవడం మంచిది. 

---------------------------------------


కర్కాటకం


మొండి బాకీలు తీర్చగలుగుతారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. నూతన ఆలోచనలు అమలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆర్ధిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. ప్రారంభించిన పనులు నిదానంగా సాగుతాయి.

---------------------------------------


సింహం


ఉద్యోగమున అధికారుల అనుగ్రహం కలుగుతుంది. నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు కలసివస్తాయి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

---------------------------------------


కన్య


ఉద్యోగ విషయమై అధికారులతో చర్చలు అంతగా అనుకూలించవు. వృధా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. రాజకీయ సభ సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆర్ధిక పరిస్థితి కొంత వరకు అనుకూలిస్తుంది.

---------------------------------------


తుల


దూర ప్రాంతాల బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. వాహన ప్రయాణాలు వాయిదా పడుతాయి. వ్యాపారమున భాగస్థులతో జాగ్రత్తగా మాట్లాడటం మంచిది.

---------------------------------------


వృశ్చికం


నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగమున కొంత అనుకూలత కలుగుతుంది. దాయాదులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన సకాలంలో పూర్తి చేస్తారు. బంధు మిత్రుల ప్రవర్తన కొంత చికాకు పరుస్తుంది.

---------------------------------------


ధనస్సు


కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవహారిస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. ప్రయాణాలలో కొంత జాగ్రత్త అవసరం. ఋణాలు వసూలవుతాయి. నిరుద్యోగులు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. వృత్తి ఉద్యోగమున ఆశించిన స్థానచలనాలు కలుగుతాయి.

---------------------------------------


మకరం


అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు కీలక సమాచారం అందుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు అదనపు పని బాధ్యతలు చికాకు కలిగిస్తాయి. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 

---------------------------------------


కుంభం


ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయపడతారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సజావుగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి తెలివిగా బయటపడతారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. 

---------------------------------------


మీనం

 

సమాజంలో ప్రముఖుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. నూతన కార్యక్రమాల ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఎదురైనా సమస్యలు తెలివిగా అధిగమిస్తారు. సోదరుల నుంచి కీలక సమాచారం అందుతుంది. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది.   

---------------------------------------

కామెంట్‌లు లేవు: