*దైవ సంకల్పం...!!*
అంతా దైవసంకల్పం ప్రకారమే జరుగుతుంది. కాబట్టి నేను ఏమీ చేయకుండా సోమరిగా కూర్చుంటాను అనటమూ తప్పే, మన ప్రయత్నం మనం చేయవలసిందే.
ఇక కొంతమంది సాధు పురుషులు దైవ సంకల్పంలో వారి సంకల్పాన్ని ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా ఎలా విలీనం చేస్తారో తెలిస్తే ఆశ్చర్యం
ఒక బాబాజీ ఉన్నాడు ...!!
ఒక రోజు పడవలో ఎక్కడికో వెళుతున్నాడు, ఆయనతో బాటు ఆ పడవలో చాలామంది జనులున్నారు.
పడవ ప్రవాహమధ్యానికి చేరింది.
ప్రవాహవేగానికి ఒక దిక్కుగా కొట్టుకుపోవడం మొదలుపెట్టింది.
అప్పుడు.. 'అయ్యలారా.. మీమీ ఇష్ట దైవాలను స్మరించు కోండి.
పడవ అదుపుతప్పింది, ముందు సుడిగుండం కూడా ఉంది, బహుశా మునిగిపోవచ్చు అని పడవవాడు హెచ్చరించాడు.
ఇంతలోనే పడవలోకి కొంతనీరు వచ్చి చేరింది, అందరూ ఏడవడం ప్రారంభించారు.
బాబాజీ మాత్రం 'జయజయరాం జయసీతారాం' అంటూ పాడుతూ తన వద్దనున్న కమండలంతో ఇంకొన్ని నీళ్లు తీసుకొని పడవలోకే వేయడం చేశాడు.
అందరికీ ఆశ్చర్యంతో పాటు భయం వేసింది...
పడవలోని నీటిని తీసి నదిలోకి వేసే బదులు నదిలోని నీటిని మునిగిపోతున్న పడవలోకి వేసి ఇంకా త్వరగా పడవ మునిగిపోయేట్టు చేస్తున్నాడు ఈ పిచ్చి సాధువు అనుకొన్నారు..
కొంత సేపటికి పడవ ప్రమాదస్థలాన్ని దాటి బయటపడింది, అదుపు లోకి వచ్చింది, పడవ వాడు, ఇతరులు ఊపిరిపీల్చు కొన్నారు.
గండం గడిచింది అన్నాడు ఆ పడవవాడు, ఇప్పుడు సాధువు మల్లి 'జయజయరాం, జయసీతారం' అని పాడుతూ తన కమండలంతో పడవలోని నీటిని తోడి నదిలోకి వేశాడు.
అక్కడున్నవారు ఆశ్చర్యపడి 'నీకు పిచ్చిపట్టిందా.. నదిలోని నీరు పడవలోకి వేశావు, ఇప్పుడు పడవ ప్రమాదం నుంచి బయటపడితే పడవలోని నీటిని బయటికి వేస్తున్నావు.
ఏమిటి ఇదంతా.. అని అడిగారు.
అప్పుడు ఆ సాధువు చాలా సంతోషం ప్రశాంతంగా వారితో 'ఇందులో వింత ఏముంది.. పడవ మునిగిపోతున్నప్పుడు పడవను ముంచటం దైవ సంకల్పం అని భావించాను, ఆ సంకల్పంతో నా సంకల్పాన్ని లీనం చేశాను. ఆ సంకల్పం త్వరగా నెరవేరటానికి నా వంతు కృషి నేను చేశాను.
మరీ పడవ ప్రమాదం నుంచి బయటపడటంతో పడవను నదిలో ముంచటం కాక, రక్షించటం దైవ సంకల్పం అని తెలుసుకొని పడవలోని నీటిని తోడి బయటపడేశాను, దైవ సంకల్పం నెరవేరటానికి నా వంతు కృషి నేను చేశాను.. అంతే అని.
కళ్లు మూసుకొన్నాడు, ఆ సాధువు పడవ మునిగి పోతున్నప్పుడు అందరిలాగా భయాందోళనలకు గురికాక దేవుడిని స్మరించాడు. పడవ ప్రమాదం నుంచి బయట పడినప్పుడు అందరిలాగా సంతోషంతో గంతులు వేయక ప్రశాంతంగా దైవ స్మరణలో నిమగ్నమయ్యాడు.
మరణాన్ని, జీవితాన్ని రెంటినీ దైవస్మరణతో స్వీకరించాడు. మనం అంతటి ఉన్నతులం కాకపోవచ్చు. కష్టనష్టాల నుంచి బయట పడటానికి శాయశక్తులా కృషి చేద్దాం.
*_🌻శుభమస్తు🌻_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి