25, అక్టోబర్ 2026, ఆదివారం

సూర్యుడు నిత్య సంబరం

  🙏🌹సూర్యుడు నిత్య సంబరం 🌹🙏


నిత్యం సందడి చేయవచ్చు శుభోదయము ఎంతో సంబరం 

సందేశం అందించి ఆ సమయం గమనించాలి మనం అందరం


తొలి కాంతుల ప్రసరణలో ఆరోగ్యాల సంబరం 

తొలి వెలుగులు తీసుకొచ్చే సౌందర్యాల సంబరం 


ప్రకృతి శోభల సౌందర్యం ఒకటే కాదు ఉత్సాహాల సంబరం 

ప్రకృతి వనము లో పొద్దున దొరికే ఫలాలు పొందాలి మనమందరం 


మొదటి వెలుగులు సిందూర కాంతుల దర్శనం సంబరం మొదటి ప్రార్థన లో లభించేటి శక్తి ని పొందాలి అందరం 


ఓం శ్రీ తొలి కాంతుల సంబరాల యాత్రలో ఆరోగ్యం ప్రకృతి సౌందర్యం ప్రసాదించు దేవాది దేవా 

శ్రీ బానోదయ తేజో కరుణాకర నమో నమః నమో నమః 


🙏🌹బాలచందర్ రాజుఉమా 

  25/10/26 +2138+చూర్ణిక

కామెంట్‌లు లేవు: